Actor Nani | గత ఏడాది చిన్నసినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘బలగం’ (Balagam). తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం (డెబ్యూ) వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు.
అయితే ఈ సినిమా అనంతరం అందరిచూపు దర్శకుడు వేణుపై పడింది. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా తాజాగా ఒక సాలిడ్ రూమర్ బయటకు వచ్చింది. వేణు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నాచురల్ స్టార్ నానితో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్ టాప్ ప్రోడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై వేణు దగ్గరనుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.