Balagam Mogilaiah | జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘బలగం’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అందరినీ ఏడిపించిన విషయం తెలిసిందే. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు పాడిన ఈ పాట తెలంగాణ ప్రజలను కన్నీళ్లు పెట్టించింది. అయితే బలగం మొగిలయ్య మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇక మొగిలయ్య ప్రాణాలను కాపాడాలని, తమని ఆదుకోవాలని ఆయన భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని వేడుకుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనని ఆదుకుంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బలగం మొగిలయ్యను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ తరుణంలోనే…తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బలగం మొగిలయ్య భార్య కోరుతున్నారు. ఎవరైనా సహాయం చేయాలని వేడుకుంటున్నారు.