‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రమేష్ చెప్పాల దర్శకుడు. డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన ఎల్లమ్మ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం ప్రివ్యూ చూసిన రాజకీయ ప్రముఖులు చిత్రంపై ప్రశంసలు కురిపించారు.తప్పకుండా చిత్రం ప్రేక్షకులందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.