Bala Krsihna | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్‌కి రెడీ అయిపోయింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాని ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా తెరకెక్కించారు. చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తూ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.
తాజాగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో బాలయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని ప్రముఖ య్యూటుబర్ నా అన్వేషణ అన్వేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన హరిహరవీరమల్లు సినిమాకి సంబంధించి మొదటి సినిమా రివ్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా సూపర్ ఉందని, థియేటర్లో గూస్ బమ్స్ వస్తున్నాయని రివ్వ్యూ ఇచ్చాడు. హరిహర వీరమల్లులో బాలయ్య బాబు స్పెషల్ ఎంట్రీ ఉందని అన్నాడు. తర్వాత అదంతా ఫేక్ అని ట్విస్ట్ ఇచ్చాడు అన్వేష్. సినిమా రివ్యూలు ఇవ్వడం కరెక్ట్ కాదని , తాను సినిమానే చూడలేదని వీడియోలో చెప్పాడు. మూవీ రివ్యూలు ఇచ్చే వారికి ఓ గుణపాఠం చెప్పాలని ఈ వీడియో చేసినట్టు అవినాష్ పేర్కొన్నాడు.