Bala Krishna | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ మూవీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ అఖండ 2 తాండవం’ రూపొందుతుది. దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర 25న రిలీజ్‌కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా విడుదలైన టీజర్లో.. ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా” అంటూ బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. బోయపాటి మార్క్ టేకింగ్, బాలయ్య యాక్షన్, అద్భుతమైన విజువల్స్, బీజీఎమ్ తో అఖండ 2 టీజర్ రికార్డులు తిరగరాస్తుంది.
కేవలం 24 గంటల్లోనే 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అంతే కాకుండా 590k లైక్స్ కూడా వచ్చాయి. ఈ క్రమంలో బాలకృష్ణ మరో అరుదైన రికార్డు సాధించారు.మొత్తానికి టీజర్‌కి ఓ రేంజ్లో స్పందన వస్తుండడంతో బాలయ్య కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక ఒక అభిమాని అయితే నేరుగా బాలకృష్ణకు ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇందులో బాలయ్య అభిమాని అనంతపురం జగన్ మాట్లాడుతూ.. ఇది అరాచకం అని అన్నారు. ఆల్ ఇండియాలో బాలయ్య లుక్కును కొట్టేవాడు లేడని గర్వంగా ఉందని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు ఈ లుక్ అందరికీ గుర్తు ఉంటుందని, ‘దాన వీర శూరకర్ణ’లో అన్న ఎన్టీఆర్ గారి లుక్కు మాదిరిగా ఉందని అన్నారు. ‘అఖండ 2తో వరల్డ్ వైడ్ రికార్డు కొట్టాలని అభిమాని చెప్పగా… డౌట్ ఏముందని బాలకృష్ణ అన్నారు.
నా అభిమానులు ఒక్కరే కాదు ప్రేక్షకులు అందరికీ ‘అఖండ 2’ టీజర్ నచ్చిందని బాలకృష్ణ తెలిపారు. నాకు బయట వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇప్పటికి పది సార్లు టీజర్ చూశామని అన్నారు. అప్పుడు నేను రాత్రి అంతా చూడండి మీకు నిద్ర ఉండదు పొండి అని చెప్పాను అని బాలయ్య చెప్పుకొచ్చారు. అమ్మ, నాన్న గారి ఆశీస్సులు, కళామ్మతల్లి ఆశీస్సులు, అలాగే మా అభిమాను ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టే ఇలా చేయగలుగుతున్నాను అని బాలయ్య అన్నారు. దైవ శక్తి, కల్మషం లేని మంచి మనస్సు మీకు ఉండడం వల్లనే ఇలాంటి మంచి క్యారెక్టర్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయని అభిమాని అన్నారు. ఈ కాల్ రికార్డింగ్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది.