Bala Krishna | నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మాస్ ఎంటర్టైనర్కి సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కి భారీ స్పందన లభించింది. బాలయ్య మాస్ అప్పీల్‌ని ఈ సీక్వెల్లో రెట్టింపు చేసి చూపించనున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బాలయ్య తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ను కూడా రీసెంట్గా ప్రారంభించారు. అమరావతిలో 21 ఎకరాల్లో నిర్మించబోయే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి ఆయన భూమిపూజ చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఆస్పత్రికి కొనసాగింపుగా, దీన్ని మరింత భారీ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇక ఇదిలా ఉంటే తాజాగా, బాలయ్య మరోసారి తన ఎనర్జీతో అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రముఖ నిర్మాత, ‘ఆహా’ ఓటీటీ అధినేత అల్లు అరవింత్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య, వేదికపై తెగ సందడి చేశారు. ఈ ఈవెంట్లో బాలయ్య, అరవింద్ సహా పలువురు ప్రముఖులు ఫుల్ ఫార్మల్ డ్రెస్‌లో స్టేజ్ పై కనిపించారు. మరింత విశేషం ఏంటంటే, వీరంతా మెడలో నిమ్మకాయల హారాలు ధరించి కనిపించారు. ఇక ఈ కార్యక్రమంలో పుష్ప2కి సంబంధించిన ఎనర్జిటిక్ పాట ప్లే అయ్యే క్రమంలో, బాలయ్య తనదైన స్టైల్లో తొడకొడుతూ, చిల్ అవుతూ ఆడియన్స్‌కి వినోదం పంచారు.
ఇక వేదికపై ఉన్నవారందరూ ‘పుష్ప’ సినిమా సిగ్నేచర్ మూవ్‌ను రిపీట్ చేస్తూ సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “బాలయ్య బాబు తగ్గేదేలే!” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ఆహాసలో బాలయ్య హోస్ట్‌గా బాగా హిట్ అయిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా బాలయ్య టీవీ ఆడియన్స్‌కూ మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో, బాలయ్య – అల్లు అరవింద్ ఒకే వేదికపై కనిపించడం ఫ్యాన్స్‌కు హుషారు తెప్పించింది. వీరిద్దరూ కలసి ఓ సినిమా చేయాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది.
Balayya Babu Thaggadeley 🔥🔥🔥#Pushpa2TheRule @alluarjun pic.twitter.com/hD51V4Oolq
— Bunny Mailapalli (@BunnyMailapalli) August 13, 2025