బాలకృష్ణ, కె.ఎస్.రవీంద్ర(బాబీ) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా తాజా అప్డేట్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే.. అందులో నిజం లేదని తెలుస్తున్నది.
షూటింగ్ ఇప్పటికే చాలావరకూ పూర్తయింది. అందుకే.. ఆలస్యం చేయకుండా డిసెంబర్ 2నే సినిమా విడుదల చేయాలని నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య భావిస్తున్నారట. బాలయ్య ‘అఖండ’ విడుదలైంది కూడా ఇదే తేదీన కావడం విశేషం.
దాంతో సెంటిమెంట్‌గా కూడా ‘డిసెంబర్ 2’ బాగా కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. బాబీడియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఊర్వశీరౌతేలా, పాయల్‌రాజ్‌పుత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.