Bakasura Restaurant | వినోదంతో పాటు ఎమోషన్‌ను మేళవించి, ప్రేక్షకులను రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయడమే ధ్యేయంగా రూపొందిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఈ సినిమా చూసిన వారికి ఓ మంచి విందు భోజనం ఆరగించిన ఫీల్ కలుగుతుందని చిత్రబృందం చెబుతోంది. తన నటనతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఎస్.జే. శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాను ఎస్.జే. మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు. హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు హీరో సుధీర్‌బాబు ముఖ్య అతిథిగా వచ్చి సినిమా హిట్ అవ్వాలని విషెస్ తెలిపాడు.
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన నటులలో ప్రవీణ్ కూడా ఒకరు. నన్ను ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్ పేరు చెబుతాను. ఏ సినిమా అయినా ఎలా సక్సెస్ చేయాలో తపన పడుతుంటాడు. ప్రవీణ్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు. మంచి నటుడే కాదు, మంచి వ్యక్తి కూడా. అందరి మంచి కోరుకుంటాడు. అందరికీ మర్యాద ఇచ్చే వ్యక్తి. ఈ సినిమా ప్రవీణ్‌కు మంచి బ్రేక్ తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈ సినిమాను వినోదమే ధ్యేయంగా నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. చిరునవ్వును ఎప్పుడూ పోస్ట్‌పోన్ చేయకూడదు. థియేటర్ అంతా ఓ ఫ్యామిలీలా కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేయాలి అని సుధీర్ బాబు తెలిపాడు.
నిర్మాత జనార్థన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు కథే హీరో. మంచి కథను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. నటుడు ప్రవీణ్, వైవా హర్ష.. ఇలా అందరం కలిసి బకాసుర రెస్టారెంట్లో మంచి డిష్‌ను ప్రిపేర్ చేశాం. అందరికీ మా డిష్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా సినిమాను దిల్ రాజు బ్యానర్ అయిన ఎస్వీసీ ద్వారా విడుదల చేయబోతున్నాం అని తెలిపారు.
దర్శకుడు ఎస్.జే. శివ మాట్లాడుతూ.. ‘విరూపాక్షకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆ సినిమా వల్లే నేను దర్శకుడినయ్యాను. ఆ సినిమా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. నా గురించి మా అన్నయ్య నిర్మాతగా మారాడు. ఈ కథకు మంచి సంగీతం కుదిరింది. వికాస్ బడిస భవిష్యత్‌లో పెద్ద సంగీత దర్శకుడవుతాడు. ప్రవీణ్ మా కథను ఒప్పుకోవడం ఈ సినిమా రూపొందడానికి ప్రధాన కారణం. కథకు తగిన విధంగా టాలెంటెడ్ నటీనటులను ఎంపిక చేసుకున్నాను. ఈ చిత్రంలో వైవా హర్ష, ఫణిల పాత్రలు కూడా ఎంతో బాగుంటాయి. ట్రైలర్‌కు మించిన విధంగా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. అందరిని కడుపుబ్బ నవ్వించే ఫ్యామిలీ అండ్ హంగర్ ఎంటర్టైనర్గా అందరినీ అలరిస్తుంది” అన్నారు.
ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘మా జీవితాలకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ప్రేమకథా చిత్రమ్ హీరో అతిథిగా రావడం ఆనందంగా ఉంది. నన్ను నమ్మి కథలో నన్ను ప్రధాన వస్తువుగా సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. వికాస్ బడిస సంగీతం టాక్ ఆఫ్ ది టౌన్. టెక్నీషియన్స్ అందరూ ది బెస్ట్ ఇచ్చారు. శివ కథ చెప్పినప్పుడే గ్యారంటీగా బాగా తీయగలడు అనే నమ్మకం కలిగింది. బకాసుర రెస్టారెంట్ ఇంటిల్లపాది చూడాల్సిన ఎంటర్టైనర్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్స అని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం రాజేష్, షైనింగ్ ఫణి, వివేక్ దండు, అమర్, రామ్ పటాస్, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, డీఓపీ బాల సరస్వతి, సంగీత దర్శకుడు వికాస్ బడిస, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వినయ్ కొట్టి తదితరులు పాల్గొన్నారు.
నటీనటులు: ప్రవీణ్, వైవా హర్ష, షైనింగ్ ఫణి (బమ్చిక్ బంటి), కేజీఎఫ్ గరుడ రామ్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్ణ, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, జబర్థస్త్ అప్పారావు తదితరులు.
సాంకేతిక నిపుణులు:
డీఓపీ: బాల సరస్వతి
ఎడిటర్: మార్తండ్ కె. వెంకటేష్
సంగీతం: వికాస్ బడిస
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్ కొట్టి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్ తంగాల
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు
నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి
దర్శకత్వం: ఎస్.జే. శివ