కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్.జె.శివ దర్శకుడు. లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈచిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
పూర్తి వినోదాత్మకంగా సాగే హంగర్ కామెడీ ఎంటర్టైనర్ ఇదని, అన్ని తరగతుల వారికీ సినిమా నచ్చుతుందని, ఇందులోని ప్రతి సన్నివేశం థ్రిల్‌ని పంచుతుందని, ప్రవీణ్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని దర్శకుడు చెప్పారు. వైవా హర్ష, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బాల సరస్వతి, సంగీతం: వికాస్ బడిస.