సంతోష్ శోభన్ కెరీర్‌కు నిజంగానే మంచి రోజులు వచ్చాయి..!
ఓ హీరోకు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి టాప్ హీరో అండ దొరికింది. దాంతో ఆ కుర్ర హీరో కెరీర్ సెట్ అయిపోయింది. అతడే సంతోష్ శోభన్. ఈ హీరోకు ప్రభాస్ అండగా నిలబడటమే కాకుండా ఆయన కెరీర్‌కు కావాల్సిన బూస్టప్ ఇస్తున్నాడు.

ఇండస్ట్రీలో ఎదగాలంటే ఏదో ఓ అండ ఉండాల్సిందే. అలా లేకపోతే ముందుకు రావడం కష్టం. బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలకు టాలెంట్ ఉన్నా కూడా ఒక్కోసారి గాడ్ ఫాదర్ లేక వెనకబడుతుంటారు. అలాంటి ఓ హీరోకు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి టాప్ హీరో అండ దొరికింది. దాంతో ఆ కుర్ర హీరో కెరీర్ సెట్ అయిపోయింది. అతడే సంతోష్ శోభన్. ఈ హీరోకు ప్రభాస్ అండగా నిలబడటమే కాకుండా ఆయన కెరీర్‌కు కావాల్సిన బూస్టప్ ఇస్తున్నాడు. వర్షం సినిమా దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్. తనకు వర్షం లాంటి మంచి విజయం ఇచ్చాడని కృతజ్ఞతతో ఆయన కొడుకు బాధ్యతలు తీసుకున్నాడు ప్రభాస్.

ఈ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఏక్ మినీ కథ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు సంతోష్ శోభన్. మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ సినిమాను కార్తీక్ రాపోలు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఎవరూ టచ్ చేయని ఒక బోల్డ్ పాయింట్ ను ఈ సినిమాలో డిస్కస్ చేశారు దర్శక నిర్మాతలు. ఏక్ మినీ కథ తర్వాత ప్రస్తుతం ఈయన పెళ్లి నేపథ్యంలో ప్రేమ్ కుమార్ అనే కామెడీ ఎంటర్ టైనర్లో నటిస్తున్నాడు. దీంతో పాటు తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మంచి రోజులు వచ్చాయి అంటూ మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు సంతోష్. వెంకటేష్, నాని, నాగ చైతన్య లాంటి క్రేజీ హీరోలతో పని చేసి ఫుల్ బిజీగా ఉన్న మారుతి.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సంతోష్‌తో సినిమా చేస్తుండటం అద్భుతమే. పైగా మారుతి సినిమా అంటే కచ్చితంగా మినిమమ్ గ్యారెంటీ.. దాంతో సంతోష్ కెరీర్ సెట్ అయిపోయినట్లే కనిపిస్తుంది. ఇదే ఊపులో మరో రెండు మూడు సినిమాలు పడితే ఈ కుర్ర హీరో సెటిల్ అయిపోతాడు. ఏదేమైనా కూడా సంతోష్ శోభన్ ను హీరోగా నిలబెట్టాలని ప్రభాస్ చేసిన ప్రయత్నం అయితే సక్సెస్ అయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Narappa Review : రొటీన్ రీమేక్..
పోర్న్ మూవీస్ కేసు.. జ్యుడీషియల్ కస్టడీకి రాజ్ కుంద్రా
చాయ్ బిస్కెట్ కుర్రాడు బిజీ అవుతున్నాడుగా..!
భారీగా ఆస్తులు పోగేసుకున్న రష్మిక..ఎంతో తెలిస్తే షాకవుతారు
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

