భారీగా ఆస్తులు పోగేసుకున్న రష్మిక..ఎంతో తెలిస్తే షాకవుతారు
సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. సినీ సెలబ్రిటీల సంపాదన, వారి లగ్జరీ లైఫ్ స్టైల్ కు సంబంధించిన ఏదో ఒక న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది.

సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. సినీ సెలబ్రిటీల సంపాదన, వారి లగ్జరీ లైఫ్ స్టైల్ కు సంబంధించిన ఏదో ఒక న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది. అయితే హీరోయిన్ల విషయంలో ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఓ లీడింగ్ హీరోయిన్ లగ్జరీ లైఫ్ స్టైల్ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే కదా..తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో దూసుకెళ్తున్న కన్నడ సోయగం రష్మిక మందన్నా.
ప్రస్తుతమున్న లీడింగ్ హీరోయిన్లలో లగ్జరీ లైఫ్ స్టైల్ అనుభవిస్తున్న భామ రష్మికనేనట. తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆస్తులపై పెట్టడం, మిగిలిన మొత్తాన్ని రాణిలా ఎంజాయ్ చేసేందుకు కేటాయించడం లాంటి విషయాలు రష్మిక జీవనశైలి ఎలా ఉందనే దానిపై క్లారిటీ ఇస్తున్నాయి. రష్మిక ఇప్పటివరకు మూడు లగ్జరీ కార్లను కొనుగోలు చేసింది. ఆడి క్యూ3, మెర్సిడేస్ బెంజ్ సీ క్లాస్, రేంజ్ రోవర్ ఎస్ యూవీ లాంటి ఖరీదైన కార్లను సొంతం చేసుకుంది రష్మిక. వీటితోపాటు ఇన్నోవా క్రిస్టా, హ్యుండాయ్ క్రెటా కూడా ఉన్నాయి. తన మూడ్‌ను బట్టి కార్లను వినియోంచుకుంటుంది రష్మిక.
రష్మిక తన ఆదాయంలో కొంత భాగం ఫ్యామిలీ బిజినెస్ కోసం కేటాయిస్తుంది. ప్రస్తుతం హిందీపై ఫోకస్ పెట్టడంతో ముంబైలో సొంతంగా ఇల్లు కూడా కొనుక్కుంది. అంతేకాదు రష్మికకు బెంగళూరులో పెద్ద బంగ్లా ఉంది. ఆసక్తికర విషయమేంటంటే రూ.6-8 కోట్లు విలువ చేసే సొంత విల్లా కూడా ఉంది. మరో ఇంట్రెస్టింగ్ థింగ్..రష్మిక హ్యాండ్ బ్యాగ్స్. అవును రష్మిక దగ్గర రూ.1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు విలువ చేసే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి. షూస్ కోసం కూడా రష్మిక లక్షల్లో ఖర్చు పెడుతుందని టాక్.
రష్మిక పలు అంతర్జాతీయ స్థాయి బ్రాండ్స్ కళ్లద్దాలు ధరిస్తుంది. మరోవైపు ప్రతీ నెలా తన కాస్ట్యూమ్స్ కోసం లక్షలు వెచ్చిస్తుందట. 2016లో కిర్రిక్ పార్టీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది రష్మిక. అంటే రష్మిక సినీ కెరీర్ మొదలుపెట్టి ఐదు సంవత్సరాలవుతుంది. కేవలం ఐదేళ్లలోనే లగ్జరీ లైఫ్ స్టైల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది రష్మిక.
ఇవి కూడా చదవండి..
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

