Bagheera | ‘ఉగ్రం’ఫేం శ్రీమురళి నటించిన యాక్షన్ ఎంటైర్టెనర్ “బఘీరా’. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ కథ అందించిన ఈ చిత్రానికి డాక్టర్ సూరి దర్శకుడు. ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని ఈ నెల 17న మేకర్స్ విడుదల చేయనున్నారు.
థ్రిల్లింగ్ యాక్షన్ ఎలిమెంట్స్, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్, అద్భుతమైన విజువల్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయని, కన్నడంలోనే కాక, తెలుగులోనూ ఈ చిత్రం ఓ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఏషియన్ సురేష్ ఎంటైర్టెన్మెంట్ ఎల్ఎల్పి సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది. రుక్మిణి వసంత్, ప్రకాశ్‌రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్‌కుమార్, గరుడరామ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఏజే శెట్టి, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్.