మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్‌గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకుడు. బాలకృష్ణ, రామశంకర్ నిర్మాతలు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం వినోదప్రధానంగా టీజర్ ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యంలో సహజమైన హాస్యంతో మెప్పించింది.
ఓ ఊరిలో నడిచే ఈ కథలో ఆర్గానిక్ కామెడీ ఉంటుందని, తప్పకుండా ప్రేక్షకులు చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని దర్శకుడు శంకర్ చేగూరి తెలిపారు. సినిమాబండి, సివరపల్లి వెబ్‌సిరీస్‌ల తరహాలో ‘బద్మాషులు’ టీజర్ నవ్వుల్ని పంచిందని రాగ్ మయూర్ పేర్కొన్నారు. ఇది ఊరి కథ అని, పాత్రలన్నీ సహజంగా ఉంటాయని రచ్చ రవి తెలిపారు. బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తేజ కూనూరు, దర్శకత్వం: శంకర్ చేగూరి.