మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకుడు. బి.బాలకృష్ణ, సీ.రామశంకర్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. జూన్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. దీపా ఆర్ట్స్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాయి.
తెలంగాణ గ్రామం నేపథ్యంలో నడిచే కథ ఇదని, పాత్రలన్నీ సహజంగా ఉంటాయని, రెండు గంటలు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని, ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తీశామని నిర్మాత పేర్కొన్నారు.