మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్‌గౌడ్ లీడ్ రోల్స్ పోషిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకుడు. బి.బాలకృష్ణ, సి.రామశంకర్ నిర్మాతలు. జూన్ 6న సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కీ, టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘లోకం మారిందా..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. హీరో నవీన్‌చంద్ర ఈ పాటను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. స్వచ్ఛమైన వినోదంతో కూడిన రూరల్ కథాంశమిదని, అన్ని వర్గాల ప్రేక్షకులకూ కనెక్టయ్యేలా సినిమా వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు.