Bad Girl | తమిళం నుంచి వస్తున్న వివాదాస్పద చిత్రం బ్యాడ్ గర్ల్(). ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి శివరామన్ (Anjali Sivaraman) కథానాయికగా నటిస్తుంది. వర్షా భరత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు సెన్సార్ పలు అడ్డంకులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు మీదా కోర్టు వరకు కూడా వెళ్లాడు వెట్రిమారన్. అయితే ఎన్నో వివాదాలు ఎదుర్కోన్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ చెప్పిన పలు కట్లకు చిత్రబృందం అంగీకరించడంతో సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది బోర్డు. ఈ క్రమంలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధంమైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీమ్ పోస్ట్ పెట్టింది.
స్కూల్ స్టేజీ నుంచే తోటి విద్యార్థులలాగే తనకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండాలనుకునే ఓ అమ్మాయి కథ ఈ చిత్రం. ఆచారాలు, కట్టుబాట్లు పాటించే కుటుంబంలో పుట్టిన ఈ అమ్మాయి తనకు నచ్చిన వాడిని ఎలా ఏంపిక చేసుకుంది. ఈ క్రమంలో ఆ అమ్మాయి జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా కథ. ఏ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
#BadGirl film is all set to hit the big screen on September 5th !!
Produced by VetriMaaran 🤝 pic.twitter.com/PNjsB7OuiO— AmuthaBharathi (@CinemaWithAB) July 8, 2025