Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్, సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ (Edward Sonnenblick) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ వార్తలు అందించి ధనుష్ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్‌ను జూన్‌లో విడుదల చేసి.. టీజర్‌ను జులైలో లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తెలుపు రంగు బనియన్‌లో కనిపిస్తున్న ధనుష్ చేతిలో గన్ పట్టుకొని వెళ్తున్న లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లీడింగ్ తమిళ చిత్ర నిర్మాత సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కెప్టెన్ మిల్లర్‌ను ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు ధనుష్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
Wishing the Inspiration of youth , our @dhanushkraja many more years of success 🤗♥️#CaptainMiller ‘s
FIRST LOOK – June 2023
TEASER – July 2033 @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @priyankaamohan@gvprakash @siddnunidop@dhilipaction pic.twitter.com/TZHYEDO5q8— Sathya Jyothi Films (@SathyaJyothi) May 10, 2023
We are very elated to present #CaptainMiller with the indomitable star @dhanushkraja 💫
This will be a very exciting film DIRECTED by the young & maverick @ArunMatheswaran 🔥🤗
A @gvprakash Musical 🥁 pic.twitter.com/FKX2iPL1yr
— Sathya Jyothi Films (@SathyaJyothi) July 2, 2022