Allari Naresh | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దివంగత ఈవీవీ సత్యనారాయణ (EVV) తనయుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు హీరో నరేష్. తొలి ప్రయత్నంలోనే ‘అల్లరి’తో హిట్ కొట్టి.. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన సీరియస్ కథలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో ‘నాంది’, ‘ఉగ్రం’, ‘ఇట్లు మారేడుమిల్లి’ చిత్రాలు చేశారు. ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేం సుబ్బు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘బచ్చల మల్లి’ అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమా కూడా సీరియస్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుండగా.. తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఈ ప్రాజెక్ట్ శుక్రవారం అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ వేడుకకు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా వచ్చి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. అనంతరం ఈ వేడుకలో టాలీవుడ్ దర్శకులు మారుతి, బుచ్చిబాబు సనా దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ఇక అల్లరి నరేశ్‌కి ఇది 62వ చిత్రం. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో ఉండబోతుంది. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇందులో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ కనిపించనుంది
#BachhalaMalli begins on an auspicious note with a pooja ceremony ❤️
Young directors @AnilRavipudi , @DirectorMaruthi, & @BuchiBabuSana graced the launch event and extended their best wishes to the team ❤🔥
Shoot begins soon!@allarinaresh @Actor_Amritha @subbucinema… pic.twitter.com/HldHj19toH
— Vamsi Kaka (@vamsikaka) December 1, 2023
‘‘మనిషిలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎంతున్నాయో కనుక్కోవడానికి మెషిన్స్ ఉన్నాయి. కానీ మూర్ఖత్వం ఎంతుందో కనుక్కోవడానికి ఏ మెషిన్లు లేవు. అలాంటి మూర్ఖత్వం హద్దులు దాటేసినవాడి కథే ఇది” అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ టీజర్ ఆసక్తిని పెంచింది.