War 2 vs Coolie | ఆగస్ట్ 14న వార్ 2, కూలీ చిత్రాలు దేశ వ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలపై ఎంత ఆసక్తి ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీకాంత్ నటించిన కూలీ, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాలకి పలు ప్రాంతాల్లో క్రేజ్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నది. కూలీ చిత్రం రజనీకాంత్ నట జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా రూపొందగా, ఈ సినిమాలో నాగార్జున అక్కినేని, అమీర్ ఖాన్, ఉపేంద్ర, పూజా హెగ్డే, శృతిహసన్ లాంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన పాటలు ఇప్పటికే మోత మోగిస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది.
బాలీవుడ్లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందించిన వార్ 2 చిత్రం కూడా ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి బ్రహ్మస్త్ర ఫేమ్ ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. హృతిక్ రోషన్‌తోపాటు జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ద్వారా తారక్ హిందీ సినిమాకు పరిచయమైతే.. హృతిక్ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. పలు ప్రాంతాల్లో కూలీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు అదిరిపోయాయి. వార్ 2 హంగామా కూడా బాగానే ఉంది. ఈ రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తాయి అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు.
అయితే తాజాగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేసిన వీడియోలో యాంకర్.. కూలీ సినిమా చూస్తావా లేకుంటే వార్ 2, సినిమా చూస్తావా అని అడుగుతుంది. అప్పుడు బెడ్‌పై పడుకున్న చిన్నారి పైకి లేచి నేను ఖడ్గం సినిమా చూస్తానని అంటాడు. ప్రతి ఏడాది ఆగస్ట్ 15న టీవీలో ఖడ్గం సినిమా ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఇలా సెటైరికల్ వీడియో క్రియేట్ చేశారని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు.
😂😂😂 pic.twitter.com/rbz5SaMICN
— EshwaRC16 Raj(Dhfc) 🐎 (@EshwarDhfc) August 12, 2025