Baby Movie Collections | ప్రస్తుతం యూత్ అంతా జపిస్తున్న మంత్రం బేబి. టీజర్,ట్రైలర్ల నుంచి పాటలు, ప్రీమియర్ల వరకు ప్రతీది సెన్సేషనే. పైగా చిత్రయూనిట్ అందరూ సినిమా కల్ట్ బొమ్మ అని ప్రమోషన్లు జరపడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే మెజారిటీ ఆడియెన్స్ మాత్రం లెంగ్త్ సంగతి పక్కన పెడితే సినిమా మాత్రం అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మఖ్యంగా వైష్ణవి పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీసిందని అంటున్నారు. ఆనంద్ దేవరకొండ సైతం మెచ్యురుడ్ పర్పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా తొలిరోజు వసూళ్లు బయటకు వచ్చాయి. అంచనాలకు మించి బేబి తొలిరోజు కలెక్ట్ చేసింది. బేబి సినిమా తొలిరోజు ఆరున్నర కోట్లుకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. షేర్ లెక్కల్లో చూసుకుంటే మూడున్నర కోట్ల రేంజ్లో వచ్చాయి. ఈ మధ్య పెద్ద పెద్ద హీరోలు సైతం ఈ నెంబర్‌ను రాబట్టలేకపోతున్నారు. అలాంటిది బేబి సినిమాకు వచ్చాయంటే దీనిపై ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. మొత్తంగా ఈ సినిమాకు దాదాపు రూ.8 కోట్లు ఖర్చయిందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే తొలిరోజే సగందాకా బడ్జెట్‌ను రికవరీ చేసింది.
ఇక ఇదే స్పీడ్ కొనసాగితే బ్రో వచ్చే వరకు ఈ సినిమాకు అడ్డే లేదు. పైగా దీనితో పాటు రిలీజైన రెండు అరవ డబ్బింగ్ సినిమాలు కూడా సో సో టాక్‌ను తెచ్చుకున్నాయి. దాంతో జనాలకు వేరే ఆప్షన్ కూడా లేకపోయింది. శని, ఆదివారాలు కూడా ఈ సినిమా బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ దీని పట్ల అంత సుముఖంగా లేనప్పటికీ కాలేజీ కుర్రకారుతో పాటు ఆటో మాస్ జనాలు ఓసారి చూద్దామని డిసైడ్ అయిపోయి అండగా నిలుస్తున్నారు.
Sensational Day 2
Day 1 – 7.1 crores Gross#BabyTheMovie ♥️ pic.twitter.com/TCHbTVm3q4
— Sai Rajesh (@sairazesh) July 15, 2023