Baby Actress Kirrak Seeta | బేబీ సినిమా యూత్‌కు బాగా ఎక్కేసింది. ఎంతలా అంటే సినిమా రిలీజై పది రోజులు దాటుతున్నా కోటిన్నర రేంజ్లో షేర్ కలెక్షన్లు వచ్చేంతలా. ఇప్పటికే బేబీ డెబ్బై కోట్ల మార్క్ చేరువలోకి వచ్చేసింది. బ్రో సినిమా గనుక లేకపోతే ఖచ్చితంగా వంద కోట్ల బొమ్మ అయ్యేది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు సైతం తీసుకురాని లాభాలను బేబి సినిమా తెచ్చిపెడుతుంది. ఫైనల్ రన్లో మరో పది కోట్ల గ్రాస్ వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇక ప్రొడ్యూసర్‌గా ఎస్ఎకేఎన్కు మాత్రం పెట్టినదానికి ఐదారు రెట్లు ఎక్కువగానే ప్రాఫిట్స్ వచ్చాయి.
ఇక ఈ సినిమాలో ముగ్గురు మేయిన్ లీడ్స్ తర్వాత ఎక్కువగా గుర్తుండే పాత్ర సీతది. వైష్ణవి ఫ్రెండ్‌గా కాస్త నెగెటీవ్ షెడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది. కనిపించింది కాసేపే అయినా పాత్ర తాలుకూ ఇంపాక్ట్ మాత్రం జనాల్లో ఇంకా ఉండిపోయింది. అందుకే ఆమె ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు తిట్టి పోస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ నటి తాజాగా వెల్లడించింది. బేబీ సినిమా తర్వాత తనకు వేధింపులు పెరిగాయని, కొందరు రేప్ చేసి.. చంపేస్తామని బెదిరించారని నటి చెప్పుకొచ్చింది. ఓ రోజు తను ఈవెంట్ నుంచి వస్తుంటే కొంత మంది అబ్బాయిలు వెంటపడి ఇలా బెదిరించారని, దాంతో వాళ్ల గురించి పోలిసులకు చెప్పమని తన ఫ్రెండ్స్ అన్నారని చెప్పింది.
కానీ తను అలా చేయలేదని, వాళ్లంతా తన రీల్ లైఫ్ క్యారెక్టర్‌ను చూసి అలా అంటున్నారని, అందుకే వారిని పట్టించుకోలేదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సినిమా తర్వాత ఇలాంటివి జరుగుతాయని సాయి రాజేష్ ముందే చెప్పాడని తెలిపింది. ఇక సీత గతంలో పలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది.