Keshava Chandra Ramavath | జబర్తస్థ్ ఫేమ్, నటుడు రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తుండగా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుంది. ఈ మూవీ నుంచి నేడు ట్రైలర్ విడుదల చేయగా.. యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన హృదయ కాలేయం, బేబీ చిత్రాల దర్శకుడు సాయి రాజేష్ వేదికపై ఉన్న యాంకర్ అనసుయపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జబర్దస్త్ కామెడీ షోలో నేను అనసుయ చాలా రోజులు కలిసి పనిచేశాం. అయితే ఒకరోజు అనసుయతో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది చూసి చాలామంది నేను అనసుయ భర్త అనుకున్నారు. దీంతో నన్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అనసుయ ఎక్కడ నువ్వు ఎక్కడా అంటూ కామెంట్లు చేశారు. తర్వాతి నేను క్లారిటీ కూడా ఇచ్చాను అంటూ సాయి రాజేష్ చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.