Babu Mohan| బాబు మోహన్.. ఈ పేరు చెబితే మన ముఖం మీద చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఎన్నో సినిమాలలో కమెడీయన్‌గా నటించి తనదైన హాస్యంతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుంటారు. సినిమాలతో పాటు రాజకీయాలలోను బాబు మోహన్ తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు రెండింటికి కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే టీవీలలో బాబు మోహన్ నటించిన సినిమాలు అప్పుడప్పుడు ప్రసారం అవుతుంటాయి. ఆ సమయంలో ఆయన కామెడీని చూసి ప్రేక్షకులు తెగ నవ్వేస్తుంటారు. ఎంతో నవ్వించిన బాబు మోహన్ని చంపే ప్లాన్ జరిగింది. ఆయనని చంపడానికి విష ప్రయోగం జరగగా,జస్ట్‌లో ఎస్కేప్ అయ్యారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబు మోహన్ .. తాను రోజుకు 30 పాన్ లు తినేవాడిని అని చెప్పాడు .. నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అది. అప్పట్లో నా నియోజక వర్గం సంగారెడ్డి వద్ద ఓ పాన్ షాప్ చూసుకున్నాను. పాన్ ఎలా కట్టాలి? అన్నది అతడికి నేను నేర్పించి పెట్టుకున్నా. ఇక హైదరాబాద్‌కి వచ్చేటప్పుడు నాకు నాలుగు ఐదు పాన్లు తప్పనిసరి. అయితే అక్కడికి వెళ్లినప్పుడల్లా కట్టించుకొని వచ్చేవాడిని. అయితే పాన్ కట్టించుకున్నాక వెంటనే వేసుకోను. మెయిన్ రోడ్ ఎక్కాక పాన్ వేసుకోవడం నాకు అలవాటు. అయితే మెయిన్ రోడ్ ఎక్కాక ఎస్పీ నుండి ఫోన్ కాల్ రాగా, ఆయన మీరు ఫలాన చోటు పాన్ తీసుకున్నారా అడిగారు. అప్పుడు అవను అని చెప్పాను.
అప్పుడు అవి తినకండి అని చెప్పారు. నేను నోట్లో వేసుకోబోతున్న సమయంలో ఇలా పాన్ తినొద్దని అంటున్నాడేంటని అనుకున్నాను. ఈలోగా మరో ఫోన్ కాల్ వచ్చింది. ‘సాబ్ పాన్ నయి కానా. ఉస్మే గెహరే యి’ . అందులో విషముంది అని ఓ లేడీ అంటూ ఫోన్ లో నే ఏడుస్తుంది. ఏంటబ్బా అనుకుని పాన్ పడేస్తున్నా? ఇంతలో మళ్లీ ఎస్పీ గారు ఫోన్ చేసారు. సీరియస్ గా చెబుతున్నా. మీపాన్ లో విషముంది. పాన్ తినకండి సార్ అని చాలా సీరియస్‌గా చెప్పారు. ఇక అప్పటి నుండి నేను తినడం పూర్తిగా మానేశాను అని బాబు మోహన్ అన్నారు. అయితే ఆయనకి ఫోన్ చేసిన ఏడ్చిన లేడి ఎవరో కాదు ఆవిడ ఎవరో కాదు ఆ పాన్ కట్టిన వ్యక్తి భార్యనే అని తెలిపారు. కొందరు వ్యక్తులు బెదిరించిన కారణంగానే అలా చేసినట్లుగా ఆమె తనతో చెప్పుకొని ఏడ్చిందని అన్నారు. అప్పుడు అనిపించింది రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా అని, ఇక అప్పటి నుండి జాగ్రత్తగా ఉన్నానని బాబు మోహన్ తెలిపారు.