Salman Khan – Sharukh khan | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ (Baba Siddique) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు వచ్చి సిద్ధిఖీపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో ఆదివారం ఉదయం ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కూపర్ ఆసుపత్రికి తరలించారు. అయితే కాల్పులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాదాపు ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిద్ధిఖీ కొన్ని నెలల కిందటే ఎన్సీపీలో చేరారు.
అయితే సిద్ధిఖీకి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మధ్య స్నేహం గురించి విషయం తెలిసిందే. వీళ్లిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు 2013లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ బర్త్ డే సందర్భంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం. దీంతో బాలీవుడ్ రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఇద్దరు బడా స్టార్ల మధ్య ఈ పవర్ ఫైట్ గురించి నిర్మాతలు ఆందోళన చెందడం మొదలుపెట్టారు.
అయితే బాబా సిద్ధిఖీకి దగ్గరికి ఈ విషయం పరిష్కారించాలని ఆయన మద్దతు కావాలని కొందరు సినీ ప్రముఖులు కోరారు. దీంతో సల్మాన్‌ను, షారుఖ్‌ను ఇఫ్తార్ విందుకు ఇన్వైట్ చేశాడు సిద్ధిఖీ. ఈ ఈవెంట్లో షారుఖ్ మొదట రాగా.. అనంతరం సల్మాన్ ఖాన్ వస్తాడు. అయితే సల్మాన్ ఖాన్‌ను చూసి షారుఖ్ లేచి హగ్ ఇవ్వడంతో అందరూ సంతోషంతో ఊగిపోయారు. అయితే ఇదే సమయంలో బాబా సిద్ధిఖీ వచ్చి వాళ్లిద్దరిని హగ్ చేసుకుని వారి మధ్య ఉన్న కోల్డ్ వార్ని ముగించడమే కాకుండా, ఇద్దరు ఖాన్‌లను మళ్లీ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారే విధంగా చేశారు! దీంతో అప్పటినుంచి సల్మాన్ ఖాన్ అంటే షారుఖ్‌కు, షారుఖ్ అంటే సల్మాన్‌కు విపరీతమైన గౌరవం పెరిగింది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.