Baahubali – The Epic | ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన రెండు ఎపిక్ చిత్రాలు ‘బాహుబలి: ది బిగినింగ్ , ‘బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. బాహుబలి మొదటి భాగం విడుదలై పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఈ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ రెండు భాగాల కలయికతో రూపొందుతున్న బాహుబలి: ది ఎపిక్ అనే చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే రాజమౌళి ఒకవైపు మహేష్ బాబు తో పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి సంబంధించిన పనులు చూసుకుంటూనే మరోవైపు బాహుబలి: ది ఎపిక్ ఎడిటింగ్ పనులు కూడా పర్యవేక్షిస్తున్నారు.
ఇక బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదలకి టైం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కానున్న రెండు భారీ సినిమాలు ‘వార్ 2 (హృతిక్ రోషన్, ఎన్టీఆర్),‘కూలీ’* (రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్) చి్త్రాలతో పాటుగా బాహుబలి: ది ఎపిక్ టీజర్‌ను థియేటర్లలో స్క్రీన్ చేయనున్నారు అని తెలుస్తుంది. అంటే ఈ రెండు సినిమాల కోసం థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులకు టీజర్ సర్ప్రైజ్గా దర్శనమిస్తుందని అంటున్నారు. అయితే బాహుబలి రెండు పార్ట్‌లని కలిపి ఒక పార్ట్‌గా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తారు?, ఏ సీన్స్ కొత్తగా ఉంటాయి? ఎంత నిడివి ఉంటుంది? అనే విషయాలపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
రీసెంట్గా టాలీవుడ్లో పెరిగిన రీ రిలీజ్ ట్రెండ్స్‌లో భాగంగా రెండు భాగాల సినిమాను ఒకటిగా మలచిన మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. దాంతో ఈ సినిమా మీద మళ్లీ విపరీతమైన హైప్ ఏర్పడింది. ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల అనంతరం, డిసెంబర్ 5న ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రంతో బరిలోకి దిగనున్నారు. అయితే, ఈ సినిమా సంక్రాంతికి వాయిదా పడే అవకాశం కూడా ఉందని ఫిలింనగర్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే ది రాజా సాబ్ టీజర్ విడుదల కాగా, ఇది మూవీపై భారీ అంచనాలే పెంచింది. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.