Baahubali The Epic | తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ఐకానిక్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి’ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. (బాహుబలి: ది ఎపిక్) BaahubaliTheEpic పేరుతో రెండు భాగాలను ఒకే పార్ట్‌గా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అయితే ఈ తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ వెర్షన్‌కి సంబంధించిన టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. రీమాస్టర్డ్, రీ ఎడిట్ వెర్షన్‌తో రాబోతున్న ఈ టీజర్ ప్రస్తుతం గూస్బంప్స్ని తెప్పిస్తుంది.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించగా.. అనుష్క, తమన్నా కథానాయికలుగా, దగ్గుబాటి రానా ప్రతినాయకుడి పాత్రలో, రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్ తదితర పాత్రల్లో అలరించారు. ఎంఎం కీరవాణి సంగీతం, శోభు యార్లగడ్డ నిర్మాణం ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.