Baahubali The Epic | తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ఐకానిక్ బ్లాక్ బస్టర్ సినిమా ‘బాహుబలి’ గురువారం 10 ఏండ్లు పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. (బాహుబలి: ది ఎపిక్) BaahubaliTheEpic పేరుతో రెండు భాగాలను ఒకే పార్ట్‌గా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అయితే ఈ తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ వెర్షన్‌కి సంబంధించిన రన్‌టైం ప్రస్తుతం వైరల్‌గా మారింది. దాదాపు 5 గంటల 27 నిమిషాల రన్‌టైంతో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించగా.. అనుష్క, తమన్నా కథానాయికలుగా, దగ్గుబాటి రానా ప్రతినాయకుడి పాత్రలో, రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్ తదితర పాత్రల్లో అలరించారు. ఎంఎం కీరవాణి సంగీతం, శోభు యార్లగడ్డ నిర్మాణం ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అయితే విడుదలై నేటికి 10 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాహుబలిని రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
Haha… No worries!
We won’t take up your whole day. It’ll be around the same time as an exciting IPL match. 🙂 #BaahubaliTheEpic #Baahubali https://t.co/wENeYgSY5V— Baahubali (@BaahubaliMovie) July 11, 2025