Baahubali The Epic | తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసి ఐకానిక్ బ్లాక్ బస్టర్ సినిమా ‘బాహుబలి’ మళ్లీ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా బాహుబలి పాత్రలో నటించగా.. కుంతలదేవి యువరాణిగా అనుష్క, భల్లలదేవుడిగా దగ్గుబాటి రానా ప్రతినాయకుడి పాత్రలో, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్ తమ తమ పాత్రల్లో అలరించారు. ఎంఎం కీరవాణి సంగీతం, శోభు యార్లగడ్డ నిర్మాణం ఈ సినిమాకు హైలెట్గా నిలిచాయి. అయితే విడుదలై నేటికి 10 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాహుబలిని రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
‘బాహుబలి.. ఎన్నో ప్రయాణాలకు నాంది.. ఎన్నో మధుర జ్ఞాపకాలు.. అంతులేని స్ఫూర్తి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ ప్రత్యేక మైలురాయిని పురస్కరించుకున్న సందర్భంగా మూవీని (బాహుబలి: ది ఎపిక్)BaahubaliTheEpic పేరుతో రీ రిలీజ్ చేయబోతున్నాం. రెండు భాగాలు కలిపి ఒక చిత్రంగా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నాం అంటూ రాజమౌళి రాసుకోచ్చాడు.
10 years ago, a question united the nation…
Now the question and the answer return together in ONE grand epic. #BaahubaliTheEpic releases worldwide on October 31st, 2025.#Celebrating10YearsOfBaahubali #DecadeofBaahubaliReign #Baahubali pic.twitter.com/iCdTyicF4F— Baahubali (@BaahubaliMovie) July 10, 2025