Baahubali the Epic | ‘బాహుబలి’ రెండు పార్టులు కలిపి ఒకే చిత్రంగా రూపొందించిన ‘బాహుబలి ది ఎపిక్’ ఈ నెల 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హీరోలు ప్రభాస్, రానా దగ్గుబాటి కలిసి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని అప్పటి షూటింగ్ జ్ఞాపకాలను, కొత్త ఎడిటెడ్ వెర్షన్ వివరాలను షేర్ చేశారు.రాజమౌళి మాట్లాడుతూ .. “రెండు పార్టులు కలిపి రన్ టైమ్ దాదాపు 6 గంటలు ఉండేది. కానీ ‘బాహుబలి ది ఎపిక్’ రన్ టైమ్‌ని 3 గంటల 45 నిమిషాలకు కుదించారు. అవంతిక లవ్ స్టోరీతో పాటు వార్ సీక్వెన్స్‌లో కొన్ని సీన్స్, ‘కన్నా నిదురించరా’, ‘పచ్చబొట్టేసిన’, ‘ఇరుక్కుపో’, అలాగే ఫస్ట్ పార్ట్‌లోని ‘మనోహరి’ పాటలను ట్రిమ్ చేశాం. కథ, ఎమోషన్ పటిష్టంగా సాగేలా ఎడిటింగ్ చేశాం. ప్రేక్షకులకు కొత్త అనుభవం దక్కుతుంది అని అన్నారు.
ప్రభాస్ మాట్లాడుతూ ..“‘బాహుబలి ది బిగినింగ్’లో ఇంటర్వెల్ సీన్ చాలా కష్టంగా అనిపించింది. భారీ క్రేన్స్ వాడాం. సెట్స్‌కి వెళ్ళిన ప్రతిసారీ గూస్బంప్స్ వచ్చేవి. భళ్లాలదేవుని విగ్రహం వెనుక బాహుబలి విగ్రహం రావాలని రాజమౌళి 12 రోజులకు ముందే ప్లాన్ చేశారని తెలిసి నేను షాక్ అయ్యాను అని అన్నారు. ఇక రానా దగ్గుబాటి మాట్లాడుతూ .. “మాహిష్మతి సామ్రాజ్య మ్యాప్ చూపించగానే ఆ పాత్ర నాదే అని ఫీల్ అయ్యా. భళ్లాలదేవుడిగా నిజంగానే రాజుగానే ఫీల్ అయ్యా. కొన్ని సీన్స్‌లో మాటలకంటే ఎక్స్‌ప్రెషన్స్‌తోనే గూస్బంప్స్ వచ్చాయి అన్నారు. కాళకేయులతో జరిగిన యుద్ధ సన్నివేశాల గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలు చెప్పారు. “అది వరుసగా 70 రోజులు హాలిడే లేకుండా షూట్ చేశాం. కాళకేయ పాత్రధారులు హోలీ పండుగ రోజున కూడా సెట్లోనే బ్లాక్ కలర్‌తో సెలబ్రేట్ చేసుకున్నారు. వారి మేకప్‌కే ఎక్కువ టైమ్ పట్టేది. క్లాత్ సీక్వెన్స్ కూడా చాలా కష్టంగా చిత్రీకరించాం అని వెల్లడించారు.
ప్రభాస్ మరో సీన్స్ గురించి చెబుతూ ..“‘దండాలయ్యా’ సాంగ్ షూట్ చేసే సమయంలో మొదటి మూడు రోజులు టెన్షన్‌గా ఉండేది. కానీ సేతుపతి తల నరికే సీన్ పూర్తయ్యాక పాత్రలో పూర్తిగా లీనమయ్యాను. దేవసేన ఎంట్రీ, కోర్ట్ రూమ్, బహిష్కరణ సీన్స్ ఫస్ట్ వీక్‌లోనే పూర్తయ్యాయి. మూడు ఏళ్ల తర్వాత ‘దండాలయ్యా’ సాంగ్ షూట్ చేశారు. వర్షం, జనం మధ్య షూట్ అవుతుందా అని అనుకున్నా, కానీ జక్కన్న పూర్తి చేశారు. అయితే ‘బాహుబలి ది ఎపిక్’తో మరోసారి ప్రేక్షకులు మహోన్నత మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూసి థియేటర్లో ఎంజాయ్ చేయనున్నారు.