Baahubali Statue | మైసూర్‌లోని ఓ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రభాస్ బాహుబలి మైనపు విగ్రహం (wax statue) ఇటీవల వార్తల్లో నిలిచింది. ‘బాహుబలి’లోని అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించిన ఈ మైనపు విగ్రహంపై చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఏర్పాటుకు తమ అనుమతి తీసుకోలేదని, దీనిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.
తాజాగా ఈ వివాదంపై మ్యూజియం నిర్వాహకులు స్పందించారు. ‘మ్యూజియంలోని ప్రభాస్ విగ్రహంపై చిత్ర నిర్మాత నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే దీన్ని తొలగించాలని నిర్ణయించుకున్నాం’ అని వెల్లడించారు. దీంతో ఈ వివాదానికి బ్రేక్ పడింది. ఐతే ఈ వివాదం చెలరేగడానికి మరో కారణం కూడా వుంది. మ్యూజియం నిర్వాహకులు ఏర్పాటు చేసిన విగ్రహం ప్రభాస్ రూపంలో లేదని చాలా మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిర్మాతల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో నిర్మాత శోభు చర్యలకు దిగారు. ఇప్పుడు మ్యూజియం నిర్వాహకుల వెనక్కి తగ్గడంతో వివాదం ముగిసింది.
బాహుబలి మైనపు విగ్రహం..
Baahubali1