Baahubali | తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటేలా చేసిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది. బాహుబలి సూపర్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్ కూడా తెరకెక్కించారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తైన సందర్భంగా ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలను ఒక్కటిగా చేసి ‘బాహుబలి: ది ఎపిక్’గా అక్టోబర్ 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. అయితే బాహుబలి – ది బిగినింగ్ చిత్రం రిలీజ్ అయి జులై 10కి పది సంవత్సరాలు పూర్తయింది.
దాంతో పదేళ్ల బాహుబలి చిత్రాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఈ సినిమా సృష్టించిన వండర్స్ గుర్తు చేసుకున్నారు. ఇక బాహుబలి టీమ్ కూడా రీ యూనియన్ అయింది. దర్శకుడు రాజమౌళి, నిర్మాతలతో పాటు ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, నాజర్, టెక్నికల్ టీమ్ అందరూ కలిసి ఒకే చోట చేరారు. ఈ సినిమా కోసం తాము పడ్డ కష్టాలు, వాటి సక్సెస్‌ను తలచుకుంటూ ఫుల్ ఖుష్ అయ్యారు. ఒక్కొక్కరు ఆ సినిమా జ్ఞాపకాలని పంచుకున్నారు. మరోవైపు పదేళ్ల బాహుబలి సందర్భంగా టీమ్ అంతా కిలిసి జరుపుకున్న రీ యూనియర్ పార్టీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘బాహుబలి: ది బిగినింగ్’ జూలై 10, 2015న విడుదలైంది. బాక్సాపీస్ వద్ద కనివినీ ఎరుగని రికార్డులు సృష్టించింది.ఈ సినిమా విజువల్ పరంగా కూడా ప్రేక్షకులకి తెగ నచ్చేసింది. అయితే తొలి పార్ట్‌లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడు అనే సస్పెన్స్‌ని క్రియేట్ చేసి సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు పెంచాడు జక్కన్న. తొలి పార్ట్‌ని మించి సెకండ్ పార్ట్ పెద్ద హిట్ సాధించింది. ఈ సినిమాతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అయితే రీ యూనియన్ పార్టీలో తమన్నా, అనుష్క కనిపించడం లేదు. వారిద్దరు మిస్ కావడం కాస్త లోటుగా కనిపిస్తుంది. మరోవైపు తన తండ్రిని కోల్పోయిన క్రమంలో కీరవాణి కూడా ఈ పార్టీకి హాజరు కాలేదు.
10 Years of Baahubali Reunion… ❤️
What began as a dream turned into something far bigger than any of us could have imagined.
A story that became a part of people’s lives…
A journey that brought us together as one family…
And memories we will cherish forever.As we come… pic.twitter.com/WHvAP5JbIZ
— Baahubali (@BaahubaliMovie) July 10, 2025