Baahubali | తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి.ఈ సినిమా తర్వాత టాలీవుడ్ సినిమా స్థాయి పూర్తిగా మారింది. భారీ బడ్జెట్‌తో అత్యద్భుతమైన చిత్రాలు రూపొందుతున్నాయి. బాలీవుడ్ తో పాటు ఇతరులు కూడా మన పరిశ్రమపై దృష్టి సారిస్తున్నారు. బాహుబలి చిత్రం రెండు పార్ట్‌లుగా విడుదలై కనీవిని రికార్డులని సాధించింది. తొలి పార్ట్ కన్నా కూడా రెండో పార్ట్ సినీ ప్రియులలో ఎంతో ఆసక్తిని కలిగించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ తో బాహుబలి రెండో పార్ట్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది అని చెప్పాలి. భారీ అంచనాల నడుమ అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఒక సునామీని సృష్టించింది.
బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్లకే కాదు అందులో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. టీవీ టెలికాస్ట్ లో కూడా బాహుబలి చిత్రం ఒక ప్రభంజనం. అలాంటి చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ఆ చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమా విడుదలై అక్టోబర్ నాటికి సరిగ్గా పదేళ్లు పూర్తి కానున్న సందర్భంగా మేకర్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో రీరిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అక్టోబర్ అంటూ రిలీజ్‌కి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఇంత త్వరగా ప్రకటన చేశారంటే మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేయబోతున్నారని అర్ధమవుతుంది. రీరిలీజ్‌లో కూడా బాహుబలి చిత్రం రికార్డులు సాధించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు రీ రిలీజ్ చరిత్ర లో 32 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం నెంబర్ 1 చిత్రం గా విజయ్ గిల్లీ మూవీ. మరి ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి మూవీ రీ రిలీజ్ మూవీస్ లలో వంద కోట్ల గ్రాస్ ని రాబట్టిన చిత్రం గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇదే జరిగిందంటే రీరిలీజ్ మూవీస్‌కి కూడా నాన్ బాహుబలి రికార్డు అనే క్యాటగిరీ యాడ్ అవుతుంది. ఈ మధ్య చాలా తెలుగు సినిమాలు రీరిలీజ్ అయి మంచి హిట్ కొడుతున్నాయి. మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్, భద్రి, హ్యాపీ డేస్, ఓయ్, ఆరెంజ్ సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తో పాటు కలక్షన్స్ దక్కించుకున్నాయి.