‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలోని తొలి గీతాన్ని ఆదివారం నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘సుర సుర అసురసుర..హర హర అతి భయంకరా’ అంటూ సాగిన ఈ గీతాన్ని సురేష్ గంగుల రచించారు. జాన్భూషణ్ స్వరపరిచారు. చక్కటి సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంటుందని, విజువల్స్ కూడా బాగుంటాయని దర్శకుడు తెలిపారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత పేర్కొన్నారు. మోహన సిద్ధిఖి, పాయల్‌రాజ్‌పుత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, పాటలు: సురేష్ గంగుల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పాలిక్.