బి.గణేశ్, బద్దెల శ్రీనివాస్, నవ్యశ్రీ లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘ప్రేమతో దెయ్యం’. బి.కె.ఎస్ దర్శకుడు. బి.కుమారస్వామి నిర్మాత. చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల సమక్షంలో ట్రైలర్‌ని విడుదల చేశారు. అతిథులుగా విచ్చేసిన టి.ప్రసన్నకుమార్, అనుపమారెడ్డి, సముద్ర, శివనాగు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ కలిసి ఈ ట్రైలర్‌ని విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
అందర్నీ ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందిందని దర్శకుడు చెప్పారు. మనసుల్ని కదిలించే సన్నివేశాలు ఇందులో ఉంటాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్, సంగీతం: సి.హెచ్.అమ్మపాండు, నిర్మాణం: శ్రీలక్ష్మీ హనుమ శివపార్వతి.