‘ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ కథలో నాన్నగారి ఇమేజ్‌కు తగినట్టు పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఉంది. అందుకే ఆయన్ను అడిగాం. సముద్రఖని, సిద్ధిక్, విశ్వంత్, చిత్రాశుక్లా ఇలా పాన్ ఇండియా వైజ్‌లో ప్రతి భాషకూ చెందిన నటులు ఇందులో ఉన్నారు. ఈ సినిమా విషయంలో తమ్ముడు మనోజ్ సహకారం మరిచిపోలేను. అందరికీ నచ్చేలా ‘దక్ష’ సినిమా ఉంటుంది. అమితాబ్ ‘పీకూ’ లాంటి సినిమాను నాన్నగారితో చేయాలని ఉంది. త్వరలోనే ఆ కోరిక తీర్చుకుంటా.’ అన్నారు మంచు లక్ష్మీ ప్రసన్న. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’. డా.మో హన్‌బాబు కీలక పాత్ర పోషించారు. తండ్రీకూతుళ్లు మో హన్‌బాబు, మంచు లక్ష్మి కలిసి నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. వంశీకృష్ణ మల్లా దర్శకుడు.
శ్రీలక్ష్మిప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటైర్టెన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ప్రెస్మీట్లో మంచు లక్ష్మి మాట్లాడారు. అతిధిగా విచ్చేసిన మంచు మనోజ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ అనీ, మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నదని, ‘దక్ష’ అందరికీ నచ్చుతుందని దర్శకుడు వంశీకృష్ణ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా రంగస్థలం మహేశ్, జెమినీ సురేశ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: గోకుల్ భారతి, సంగీతం: అచు రాజమణి.