Ayushmann Khurrana : బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా బల్గరీ ఇండియా ఎక్స్లూజివ్ ఎడిషన్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. రూ. 12 లక్షల విలువైన బల్గరీ ఇండియా లేటెస్ట్ కాడా బ్రేస్‌లెట్‌ను ఆయుష్మాన్ లాంఛ్ చేశారు. బ్రాండ్ వెబ్సైట్లో దీని విలువ రూ. 12,10,000 కాగా ఈ ప్రోడక్ట్‌ను ధరించిన తన ఫొటోను నటుడు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
భారత్ స్ఫూర్తితో ఆధునిక బారత్, సంప్రదాయ విలువలను మేళవిస్తూ ఖరీదైన రాళ్లు, యల్లో గోల్డ్‌తో ఈ బ్రేస్లెట్ రూపుదిద్దుకుందని బల్గరీ తెలిపింది. బల్గరీ ప్రోడక్ట్‌లో తనను భాగం చేసినందుకు గర్వంగా ఉందని సోషల్ మీడియా వేదికగా నటుడు ఆయుష్మాన్ ఖురానా పేర్కొన్నారు.
ఇది కేవలం ఆభరణం కంటే అధికమని, దీటైన వ్యక్తిత్వానికి ప్రతీక అని ఆయన రాసుకొచ్చారు. ఇక ఈ ఫోస్ట్పై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. ఈ గోల్డెన్ బ్రేస్‌లెట్‌తో మీరు వజ్రంలా మెరుస్తున్నారని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Bhumi Pednekar | బ్లూకలర్ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న భూమి పెడ్నేకర్..