కుటుంబ సభ్యుల మధ్య బంధాలు, అనుబంధాల నేపథ్యంతో తెరకెక్కిన సినిమా ‘బలగం’. వేణు యెల్దండి దర్శకుడు. చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిందీ సినిమా. ఈ చిత్రానికి ఇప్పటికే అంతర్జాతీయంగా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో 13వ దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ గెల్చుకున్నారు.
81 దేశాల నుంచి 780కి పైగా సినిమాలు ఈ పురస్కారాల కోసం పోటీలో నిలిచాయి. ఈ పోటీలో తనకు అవార్డ్ దక్కడంపై భీమ్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘బలగం’ చిత్ర విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ చిత్ర పాటలు కథలోని భావోద్వేగాలను మరింతగా ప్రేక్షకులకు చేర్చాయి.