అవినాశ్ తిరువీధుల స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న మైథలాజికల్ రూరల్ డ్రామా ‘వానర’. సిమ్రాన్ చౌదరి కథానాయిక. నందు విలన్‌గా నటించారు. అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. మంచు మనోజ్ టీజర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. అవినాశ్ తిరువీధుల మాట్లాడుతూ ‘నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటలు రాశారు.
రాయడంతోపాటు వాటిని ఎలా పలకాలో, ఎలా రియాక్టవ్వాలో వాయిస్ రికార్డ్ పంపేవారు. దాంతో మాకు షూటింగ్ ఈజీ అయిపోయింది. వివేక్ మ్యూజిక్, చోటా కె.ప్రసాద్ ఎడిటింగ్.. ఇలా అన్నీ క్రాఫ్ట్లూ అద్భుతంగా పనిచేశాయి. నిర్మాతలు కావాల్సినంత సహకారం అందించారు. సినిమా పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం.’ అని తెలిపారు. ఇంకా సాయిమాధవ్ బుర్రా, డీవోపీ సుజాత సిద్ధార్థ్, సమర్పకులు శంతను పత్తి, రైటర్ విశ్వజిత్, చోటా కె.ప్రసాద్, నటులు శివాజీరాజా, హర్ష కూడా మాట్లాడారు.