Avika Gor | బలికా వధు సీరియల్ ఫేమ్ అవిరా గోర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నది. తన ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకోబోతున్నది. గత కొంతకాలంగా ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రియుడు మిలింద్ చంద్వానీతో నిశ్చితార్థం చేసుకున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నది. ఈ సందర్భంగా ఎమోషనల్ క్యాప్షన్ జోడించి.. ఫొటోలను షేర్ చేసింది. ‘అతను అడిగాడు. నేను నవ్వాను. ఏడ్చాను. ఆ తర్వాత గట్టి అరిచి ఎస్ అని చెప్పాను. నా జీవితంలో ఈజియెస్ట్ ‘అవును’ అని చెప్పాను. ప్రేమ అన్నది పరిపూర్ణం కాకపోయినా అది మాయాజాలం లాంటిది’ అంటూ పోస్ట్ పెట్టింది. మిలింద్ తన మనసులోని మాటలు చెబుతున్నప్పుడు నేను సినిమా ప్రేమికురాలిగా మారిపోయా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్లో-మోషన్ డ్రీమ్స్ కనిపించాయి. అతను లాజిక్‌గా మాట్లాడుతాడు. ప్రశాంతంగా ఉన్నాడు. అతను అడిగిన సందర్భంలో గాల్లో తేలినట్లు అనిపించింది.
నా కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. నా మైండ్ ,లో ఇంకే ఆలోచనలు లేవు. ఎందుకంటే ఇది నిజమైన ప్రేమ? ఇది ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ, ఇదొక మ్యాజిక్’ అంటూ అవికా గోర్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. అవికా గోర్, మిలింద్ 2020 సంవత్సరంలో డేటింగ్లో ఉన్నారు. దాదాపు 5 సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న ఇద్దరు.. తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. అవికా ఇప్పటికే చిన్నతనంలోనే టీవీ సీరియల్స్‌లో నటించింది. అవికా నటించిన బాలికా వధు సీరియల్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ‘చిన్నారి పెళ్లి కూతురు’ పేరుతో తెలుగులోనూ ప్రసారమైంది. ఆనంది పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. మిలింద్ చంద్వానీ ఓ సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త. అంతే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశాడు. క్యాంప్ డైరీస్ పేరిట ఓ ఎన్జీవోని నడుపుతున్నాడు. 2019లో ఎంటీవీలో ప్రసారమైన ‘రోడీస్ రియల్ హీరోస్’ షోలో పాల్గొన్నాడు. ఆ సమయంలోనే కామన్ ఫ్రెండ్ ద్వారా అవికా గోర్, మిలింద్కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమ చిరుగురించి ఇద్దరు డేటింగ్ చేశారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు.