హైదరాబాద్: అవతార్ సీక్వెల్ మరో విజువల్ వండర్. అదో బ్లూ డ్రామా. జేమ్స్ కెమరూన్ కన్నా అద్భుతంగా సీక్వెల్స్ తీయగల ఘనుడు లేడన్నది వాస్తవం. ఏలియన్స్, టర్మినేటర్ 2, ఇప్పుడు అవతార్ .. ద వే ఆఫ్ వాటర్.. కెమరూన్ కళాఖండమే. 13 ఏళ్ల తర్వాత వచ్చిన అవతార్ 2 సీక్వెల్ ఓ స్టన్నింగ్ విజువల్ ట్రీట్. అంతకన్నా ఎక్కువగా ఇదో ఫ్యామిలీ డ్రామా. కుటుంబమే ముఖ్యం అనుకున్న జాక్ సల్లీ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడో సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. పండోర గ్రహంపై మళ్లీ క్వాట్రిచ్(విలన్) అటాక్ చేస్తాడు. జాక్నే పర్సనల్‌గా టార్గెట్ చేస్తాడు. ఆ దాడి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు జాక్‌తో పాటు నేత్రీ ఓ సురక్షిత ప్రాంతానికి వెళ్తారు. జాక్ తన పిల్లల్ని ఎలా రక్షించుకున్నాడు.. ఎలా ఆ పిల్లలు తమ పేరెంట్స్‌ను కాపాడుకున్నారో .. ఆ కలర్‌ఫుల్ డ్రామాను కెమరూన్ ఆర్టిస్టిక్ ట్యాలెంట్‌తో చూడాల్సిందే.
Tonight, the motion picture event of a generation arrives.
Experience #AvatarTheWayOfWater only in theaters December 16. Get tickets now: https://t.co/9NiFEIpZTE pic.twitter.com/I2ahl0tiOF
— Avatar (@officialavatar) December 15, 2022
ఇండియన్ మూవీగోయర్స్కు ఫ్యామిలీ డ్రామా కామనే. కానీ ఆ స్టోరీని చాలా డీసెంట్‌గా చెప్పాడు జేమ్స్. ఇక విజువల్ ఎఫెక్ట్స్ ఓ థ్రిల్. 3డీ వర్షన్లో ఆ థ్రిల్స్‌కు అంతే ఉండదు. కెమరూన్‌తో పాటు రిక్ జాఫా, అమండా సిల్వర్ ఈ ఫిల్మ్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. భూ గ్రహం నుంచి పండోరాకు జాక్ కోసం వెళ్లిన క్వాట్రిచ్ భారీ విధ్వంసానికి పాల్పడుతాడు. జాక్ స్వంత పిల్లల్ని, దత్తత పిల్లల్ని బంధిస్తాడు. అయితే భూగ్రహ వాసుల నుంచి తప్పించుకున్న జాక్ ఫ్యామిలీ.. రక్షణ కోసం ఓ దీవుల సమూహానికి వెళ్తుంది. మెటకాయన్ల వద్ద జాక్ ఫ్యామిలీ ఆశ్రయం పొందుతుంది. ఆ సమయంలో ఆ సముద్ర దీవుల్లో ఉండే పాయకన్ అనే తిమింగలం లాంటి జలజంతువుతో జాక్ కుమారుడు లోవాక్ స్నేహం చేస్తాడు.
Be the first to witness what critics are calling “a cinematic masterpiece.”
Tonight, #AvatarTheWayOfWater arrives in 3D only in theaters. Get tickets now: https://t.co/9NiFEIpZTE pic.twitter.com/kGBaZwUfCi
— Avatar (@officialavatar) December 15, 2022
నిజానికి ద వే ఆఫ్ వాటర్ టైటిల్లోకి కథ వెళ్లడానికి కనీసం గంట సమయం పడుతుంది. ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ మెయిన్ స్టోరీలోకి వెళ్లేందుకు జేమ్స్ ఎక్కవ టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ కథా బలాన్ని మాత్రం ఎక్కడా పట్టుకోల్పోడు. మెటకాయన్ దీవి ప్రజలతో కలిసిన జాక్ ఫ్యామిలీ అక్కడ బ్రతికేందుకు కావాల్సిన అన్ని మెళకువల్ని నేర్చుకుంటుంది. అవతార్ ఫస్ట్ పార్ట్‌లో అడవులు, పక్షులు, జంతువులతో ఆకట్టుకున్న కెమరూన్.. ఇక సీక్వెల్లో జలచరాలతో థ్రిల్ చేశాడు. నీటిలో పక్షుల్లా ఎగిరే జంతువులతో చేసే స్టంట్స్ ఓ మ్యాజిక్‌లా సాగుతుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్ యాక్షన్ స్టయిల్లో సినిమాను తెరకెక్కించాడు జేమ్స్.
On December 16, experience the motion picture event of a generation.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. Get tickets now: https://t.co/9NiFEIpZTE pic.twitter.com/UitjdL3kXr
— Avatar (@officialavatar) November 22, 2022
జాక్ ఆనవాళ్లు తెలుసుకున్న క్వాట్రిచ్ .. ఆ దీవిపై దండయాత్ర చేస్తాడు. ఆ సమయంలో మెటకాయన్లతో జాక్ .. వారిపై యుద్ధానికి వెళ్తాడు. ఇక సినిమా అంతా యాక్షన్, ఎమోషనల్ డ్రామా స్టయిల్లో సాగుతుంది. పిల్లల కోసం పేరెంట్స్.. పేరెంట్స్ కోసం పిల్లలు అన్న రీతిలో … స్టోరీ లైన్‌ను ప్రజెంట్ చేశాడు జేమ్స్. సముద్రంలో సాగే ఫైటింగ్ సన్నివేశాల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. చాలా లెన్తీ యాక్షన్ సీన్స్ ఉన్నా.. ఆ ఫైటింగ్ సీక్వెన్సుల్లో ఉండే మజా మాత్రం మిస్ కాలేం.
Welcome back to Pandora. Listen to the Avatar: The Way of Water soundtrack featuring the song “Nothing is Lost (You Give Me Strength)” by @theweeknd and original score from @simonfranglen.https://t.co/3XqdySxalZ
See #AvatarTheWayOfWater, only in theaters December 16. pic.twitter.com/0ijfF82fh2
— Avatar (@officialavatar) December 15, 2022
సంతోషం చాలా సింపుల్ అని, కలిసి ఉంటే కలదు సుఖమని, ఫ్యామిలీనే కంచుకోట అన్న జాక్ డైలాగ్స్ ఫిల్మ్‌లో ఉన్న సెంటిమెంట్‌ను ప్రజెంట్ చేస్తుంది. కుటుంబమే మన బలం, బలహీనత అన్న థీమ్‌ను జేమ్స్ చాలా వండర్‌ఫుల్‌గా తెరకెక్కించాడు. అడవైనా.. సముద్రమైనా.. అందాలకు కొదవ లేదని, ప్రకృతిని ఎలా ఆస్వాదించాలో.. ప్రేమతో కుటుంబాన్ని ఎలా నిలుపుకోవాలో కెమెరూన్ తన కళాదృష్టితో అవతార్ సీక్వెల్లో చూపించిన తీరు అనిర్వచనీయం. కథా నేపథ్యంలో కొత్తదనం లేకున్నా.. జేమ్స్ తన విజువల్ స్కిల్స్‌ను తెరకెక్కించిన వైనం వండరే. అసాధారణ రీతిలో అనునిత్యం సినిమాను ఎంజాయ్ చేసే స్టయిల్లో స్క్రిప్ట్‌ను రూపొందించారు. 3 గంటల 12 నిమిషాలు ఆ విజువల్ ఎఫెక్ట్స్‌కు అతుక్కుపోవడం ఖాయం. బ్లూ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్లు .. అవతార్ సీక్వెల్‌కు ఫుల్‌మార్క్స్ ఇవ్వాల్సిందే.