‘ధర్మచక్రం’ పేరుతో ఓ రాజకీయ చిత్రం రూపొందుతున్నది. SIFFAA సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకటరమణ పసుపులేటి దర్శకుడు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘నోటు రుచి మరిగిన వారికి పదవులిస్తే ఓటు విలువ తగ్గుతుందనే సందేశంతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా ఆడియోను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజకిరణ్.