TDP MLA Daggubati Venkateswaara rao | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ ఎమ్మెల్యే దూషిస్తూ ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వైరల్ అయిన ఆడియోపై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. ఈ ఆడియో తనది కాదని, స్థానిక రాజకీయాల కారణంగా తనపై అసూయపడేవారు ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు క్షమాపణలు తెలిపాడు.
సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆడియో తనది కాదని. రాజకీయాల్లో భాగంగా నాపై గిట్టనివాళ్లు ఈ వీడియో క్రియేట్ చేసి పెట్టారని ఆయన స్పష్టం చేశారు. తనకు నారా, నందమూరి కుటుంబాలపై చిన్నప్పటి నుంచి అపారమైన గౌరవం ఉందని, వారి అభిమానినని తెలిపారు. ఈ ఆడియో వలన నందమూరి, ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే, తన తరపున క్షమాపణలు కోరుతున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వీడియోలో చెప్పుకోచ్చాడు.
జూనియర్ ఎన్టీఆర్ను బూతులు తిట్టిన ఆడియో లీక్పై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
ఈ ఆడియో రికార్డు నాది కాదు.. లోకల్ రాజకీయాల్లో భాగంగా నాపై గిట్టని వాళ్లు ఈ వీడియో పెట్టారు
నాకు నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అంటే చిన్నప్పటి నుండి చాలా అభిమానం… https://t.co/9IxsLm8heg pic.twitter.com/PtT5WQqZzo
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025