Captain Miller | స్టార్ యాక్టర్ ధనుష్ (Dhanush) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ హీరో టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. ఈ మూవీలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లోడింగ్.. త్వరలోనే రాబోతుందంటూ ఓ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇదిలా ఉంటే యాక్టర్ అరుణ్ విజయ్ కెప్టెన్ మిల్లర్ రూలింగ్ ట్విట్టర్ అంటూ ఓ స్టిల్ షేర్ చేశారు. ధనుష్ కంప్లీట్ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్న స్టిల్ వైరల్ అవుతోంది. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ ఇదే స్టైల్లో ఉండబోతుందా..? అని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. దీనిపై క్లారిటీ రావాలంటే కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. కాగా ఇప్పటికే కెప్టెన్ మిల్లర్‌కు సంబంధించిన లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తిగా వస్తున్న కెప్టెన్ మిల్లర్ మూడు పార్టులుగా రాబోతుందని ఇటీవలే ఓ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar) కీలక పాత్రలో నటిస్తున్నాడు. సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్‌ను జూన్‌లో, టీజర్‌ను జులైలో లాంఛ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్ అందించగా.. తేదీలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
#CaptainMiller * #Leo Ruling Twitter 🔥@dhanushkraja @actorvijay pic.twitter.com/SLZuMVy40y
— Arun Vijay (@AVinthehousee) June 25, 2023