Atlee | కూతురికి జపనీస్ పేరు పెట్టిన అట్లీ.. ‘మియూ’ వెనుక అద్భుతమైన అర్థం ఇదే!
Atlee | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అట్లీ కుటుంబంలో ఇటీవల ఆనందం రెట్టింపైంది. స్టార్ దర్శకుడు అట్లీ, ఆయన భార్య ప్రియ దంపతులకు ఇటీవల పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ చిన్నారి కుమార్తెకు పెట్టిన ప్రత్యేకమైన పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Atlee | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అట్లీ కుటుంబంలో ఇటీవల ఆనందం రెట్టింపైంది. స్టార్ దర్శకుడు అట్లీ, ఆయన భార్య ప్రియ దంపతులకు ఇటీవల పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ చిన్నారి కుమార్తెకు పెట్టిన ప్రత్యేకమైన పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గత ఏప్రిల్లో జన్మించిన తమ కుమార్తెకు అట్లీ దంపతులు ‘మియూ’ (Miyou) అనే ప్రత్యేకమైన పేరును ఖరారు చేశారు. పాప పుట్టిన దాదాపు నెల రోజుల తర్వాత, ఆదివారం సోషల్ మీడియా ద్వారా ఈ పేరును అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్నారి చేతిని ప్రేమగా పట్టుకున్న ఓ మధురమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
ఆ పోస్ట్లో వారు, “మా హృదయాలకు ఒక కొత్త ఇల్లు దొరికింది. ఆమె పేరు మియూ. మా గుండెల్లో అత్యంత పెద్ద స్థానాన్ని సంపాదించుకున్న చిన్నారి దేవత” అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పేరును ప్రత్యేకంగా నిలబెట్టింది దాని అర్థమే. సాధారణంగా భారతీయ లేదా సంస్కృత మూలాల పేర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే అట్లీ దంపతులు జపనీస్ సంస్కృతి నుంచి ఈ పేరును ఎంపిక చేసుకున్నారు. జపనీస్ భాషలో “మి” (Mi) అంటే అందం, “యూ” (You) అంటే మృదుత్వం, శ్రేష్ఠత లేదా సౌమ్యత అని అర్థం. మొత్తం కలిపి చూస్తే ‘మియూ’ అంటే అందం, ప్రేమ, పవిత్రమైన సౌమ్యత కలిగిన వ్యక్తి అనే అర్థం వస్తుంది.
ఈ విభిన్నమైన పేరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో అట్లీ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, అట్లీ–ప్రియ దంపతులకు ఇప్పటికే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వారి పెద్ద కుమారుడు ‘మీర్’ జనవరి 2023లో జన్మించాడు. ఇప్పుడు చిన్నారి రాకతో మీర్ పెద్దన్నయ్యగా మారాడని అప్పట్లో వారు ప్రత్యేకమైన స్కెచ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు దర్శకుడిగా కూడా అట్లీ కెరీర్ ప్రస్తుతం పీక్లో ఉంది. జవాన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన క్రేజ్ పాన్-ఇండియా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’పై అట్లీ దృష్టి సారించారు. ఈ చిత్రంలో దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది. ఒకవైపు కుటుంబంలో కూతురు రాకతో ఆనందంలో మునిగిపోయిన అట్లీ, మరోవైపు ‘రాకా’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- first look
- kaarthi
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

