అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించి చిత్రం ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ నెల 12న విడుదల చేస్తున్నది. ఇటీవలే ట్రైలర్‌ను విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ట్రైలర్ మెప్పించింది.
‘యూనిఫామ్ వేసుకున్న తర్వాత అందరూ ఫ్యామిలీనే’ అంటూ హీరో అథర్వ చెప్పిన సంభాషణ ఆకట్టుకునేలా ఉంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ ట్రాక్‌కి కూడా ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇందులో హీరో అథర్వ మురళి పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శక్తిశరవణన్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, దర్శకత్వం: రవీంద్ర మాధవ.