Athadu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే వస్తుందంటే ఎలాంటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారం ముందు నుండే అభిమానులు ఏర్పాట్లలో ఉంటారు. ఈ సారి మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు నటించిన అతడు చిత్రం విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 9 సూపర్ స్టార్ బర్త్ డే కావడంతో అభిమానులకు ఈ సినిమాతో మంచి వినోదం పంచేందుకు సిద్ధమయ్యారు. అయితే చిత్ర 4K ట్రైలర్‌ని హరిహర వీరమల్లు మూవీ ఇంటర్వెల్ సమయంలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇద్దరు హీరోల అభిమానులకి పసందైన వినోదం అందనుంది. కాగా, హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం విదితమే.
మరోవైపు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తమ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్లింప్స్ విడుదలైతే, అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. తొలిసారి మహేష్ బాబు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తుండగా, ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే మూవీకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. త్వరలో చిత్ర బృందం కెన్యూ షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా, మహేష్ బాబుతో పాటు ఇతర కీలక నటులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
అయితే మహేష్ బాబు పుట్టిన రోజు సెలెబ్రేషన్లు ఈ సారి ప్రత్యేకమైన రీతిలో జరుగనున్నాయి, దానికి తోడు మైత్రీ మూవీ మేకర్స్, ఇతర సినీ ప్రొడక్షన్ హౌజెస్ కూడా తమ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నాయి. దాంతో ఫ్యాన్స్ అంతా మహేష్ బాబు అభిమానులు ఆగస్ట్ 9 ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకులని పలకరించారు. ఈ చిత్రం ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా రాజమౌళి ప్రాజెక్ట్‌పైనే హోప్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రంతో మహేష్ ఇమేజ్ హాలీవుడ్ స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నారు.