Athadu | సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో అతడు చిత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ చిత్రం మహేష్ బాబులోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాని ఎన్నిసార్లు చూసిన బోరింగ్ ఫీల్ రానే రాదు. అయితే ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ క్లాసిక్ మాస్టర్‌పీస్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ-రిలీజ్ వార్త బయటికి వచ్చినప్పటి నుంచే ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఆకాశాన్నంటింది.ఇక ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ జెట్ స్పీడ్‌లో కొనసాగాయి. అతడు’ రీ-రిలీజ్‌కు ఓవర్సీస్లోనూ అద్భుతమైన స్పందన లభిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. నైజాం ఏరియాలో ఏషియన్ సునీల్ భారీ ఎత్తున ‘అతడు’ను విడుదల చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35MM, దేవి థియేటర్స్ లాంటి ప్రముఖ థియేటర్స్‌లో ఈ మూవీ విడుదల అవుతుండగా, అక్కడ హౌస్‌ఫుల్ బోర్డ్‌లు కనిపిస్తున్నాయి. ఇది సినిమా పట్ల ఉన్న అభిమానాన్ని స్పష్టంగా చూపుతోంది. ఇక తిరుపతిలో కూడా ఈ మూవీని భారీ ఎత్తున రీరిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని పలని థియేటర్లో అతడు మూవీ చూసేందుకు సిద్ధమైన అభిమానులు ఏకంగా 500 కిలోల పేపర్లు రెడీ చేసుకున్నారు. వాటిని కట్ చేయించి 11.30గం.లకి, సాయంత్రం 6.30 షోలో విసరి హంగామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వారు పేపర్స్ కటింగ్ చేయిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం, ‘అతడు’ రీ-రిలీజ్ థియేట్రికల్ హక్కులు ఏపీలో 3 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఒక రీ-రిలీజ్ సినిమా కోసం ఇది భారీ ఫిగర్ అని చెప్పాలి. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ సినిమా అప్పట్లో మహేష్ బాబుకు కమర్షియల్ గానూ, క్రిటికల్ గానూ బిగ్ బ్రేక్ ఇచ్చింది.త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, మణిశర్మ మ్యూజిక్, మహేష్ స్టైలిష్ యాక్టింగ్ కలగలిపి ఈ సినిమాను ఓ ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్‌గా నిలిపాయి. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుండటంతో, పాత జెనరేషన్‌కి , కొత్త తరం ప్రేక్షకులకు ఒక రిచ్ సినిమాటిక్ అనుభవం అందనుంది. ఇక ఈ రోజు మహేష్ బర్త్ డే సందర్భంగా పెద్ద ఎత్తున విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
Papers cutting ki vacham ippude 🤙🤙
Morning 11:30 show
Evening 6:30 showMotham 500Kgs papers 😎😎😎😎😎#Tirupati Palani theatre ni tagalapetestham repu 🔥🔥#Athadu #Athadu4K #AthaduSuper4K #AthaduHomeComing #MaheshBabu #SSMB29 #AthaduMania #AthaduOST #Athadu4KBookings pic.twitter.com/2zTPgShcD4
— Akash Raju 🔥🔥 (@Raju_SSMB) August 8, 2025