MagicDistrict | నగరవాసులకు, ముఖ్యంగా సాహస ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ (Magic District) సిద్ధమైంది. కొండాపూర్‌లోని ప్రముఖ AMB శరత్ సిటీ క్యాపిటల్ మాల్ 6వ అంతస్తులో, ఆసియాలోనే మొట్టమొదటి రియల్-లైఫ్ మల్టీ-థీమ్ అడ్వెంచర్ డెస్టినేషన్‌ను ఘనంగా ప్రారంభించారు. సుమారు 38,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ అడ్వెంచర్ జోన్, కేవలం చూసి ఆనందించే వినోదం మాత్రమే కాదు. ఇక్కడ సందర్శకులే కథలో పాత్రధారులుగా మారి, క్లిష్ట పరిస్థితుల నుంచి ప్రాణాలతో బయటపడేలా ఒక వినూత్నమైన ‘ఇమ్మర్సివ్’ అనుభవాన్ని పొందుతారు.
నేషనల్ అవార్డు గ్రహీత, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ తవ్వ శ్రీనివాస్ ఈ మ్యాజిక్ డిస్ట్రిక్ట్‌కు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “భారతీయుల మేధస్సు, సృజనాత్మకత ప్రపంచ స్థాయికి ఏమాత్రం తక్కువ కాదని చాటిచెప్పడమే మా లక్ష్యం. 25 ఏళ్ల అనుభవంతో, మరెక్కడా లేని విధంగా ఈ సాహస ప్రపంచాన్ని రూపొందించాం. దేశవ్యాప్తంగా మరో 27 విభిన్న కాన్సెప్టులను తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన కుమార్తె, ఆపరేషన్ మేనేజర్ చందన లిపి అమెరికాలో తన ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు రావడం విశేషం. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా ఏడు థీమ్‌లలో నాలుగు సాహస ప్రపంచాలను సందర్శకులకు అందుబాటులోకి తెచ్చారు:
జోంబీ సిటీ (Zombie City): జోంబీలు ఆక్రమించిన నగరం నుండి తెలివితేటలతో ప్రాణాలతో బయటపడటం.
స్కేరీ ఎస్కేప్స్ (Scary Escapes): భయంకరమైన వాతావరణంలో క్లూస్ వెతుకుతూ, పజిల్స్ సాల్వ్ చేస్తూ టీమ్ వర్క్‌తో తప్పించుకోవడం.
స్కేరీ హౌస్ (Scary House): హారర్ సినిమాలను తలపించేలా లైవ్ ఇంటరాక్షన్లు, భీతి గొల్పే సౌండ్ ఎఫెక్ట్స్‌తో కూడిన అనుభవం.
బూ బూ హౌస్ (Boo Boo House): ఇది ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించబడింది. భయం లేకుండా పిల్లల్లో ధైర్యాన్ని పెంచుతూ నవ్వులు పూయించే స్పూకీ థీమ్.
నిర్వాహకుల్లో ఒకరైన కె. రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సరికొత్త కాన్సెప్ట్‌కు నగరవాసుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్, స్టూడెంట్స్ మరియు టూరిస్టులకు ఇది ఒక మరపురాని అనుభవాన్ని మిగిలిస్తుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.