Cinema News | మెడికో థ్రిల్లర్ కథాంశంతో ఓ చిత్రం రూపాందుతున్నది. ఇంకా పేరు నిర్ధారించని ఈ సినిమాకు అశ్విన్‌బాబు కథానాయకుడు. ఎం.ఆర్.కృష్ణ దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత. గురువారం హీరో అశ్విన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ఓ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది. సినిమా కాన్సెప్ట్‌ని తెలిపేలా పోస్టర్ని డిజైన్ చేసినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్, వైజాగ్, కొడైకెనాల్ల్లో 75శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. రియా సుమన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అయేషా ఖాన్, మురళీశర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, వీటీవీ గణేశ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్‌రెడ్డి, సంగీతం: గౌరహరి, నిర్మాణం: అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్.