Ashu Reddy | జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాతో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది. బిగ్బాస్ సీజన్ 3 సహా, బిగ్బాస్ నాన్స్టాప్లో కూడా పాల్గొని ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ డోసు చాలా ఎక్కువగానే ఉంటుంది. రామ్ గోపాల్ వర్మతో కలిసి అషూ రెడ్డి చేసిన ఇంటర్వ్యూ అయితే కాక రేపింది. ఏదో ఒక విధంగా అషూ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.
అయితే ఈ బ్యూటీకి కాస్త దైవ చింతన ఉంది. పలు సందర్భాలలో గుళ్లకి వెళ్లి పూజలు చేస్తుంది. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. మరోవైపు గతంలో పలు సార్లు వేణు స్వామిని కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించింది . అయితే ఈసారి ప్రముఖ కామాఖ్య ఆలయంలో అషూ రెడ్డి పూజలు చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీలకు జాతకాలు చెబుతోన్న వేణు స్వామి వారికి ఏమైనా దోషాలు ఉంటే పరిహారంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఆయన దగ్గర టాప్ హీరోయిన్స్ కూడా పూజలు చేయించుకున్నారు.
తాజాగా అస్సాంలోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్న అషూ రెడ్డి అక్కడ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇవి ఇప్పుడు వైరల్గా మారాయి. ఇక ఇదిలా ఉంటే అషూ రెడ్డి ఈ మధ్య తన సోషల్ మీడియాలో షాకింగ్ విషయం వెల్లడించింది. తాను బ్రెయిన్ సర్జరీ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి శస్త్రచికిత్స చేసేముందు, చేసిన తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చూపించింది. సర్జరీ కోసం తన హెయిర్ కూడా కాస్త షేవ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది.